Kondabitragunta Temple: కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రథసప్తమి 2026 – సప్తవాహన సేవల షెడ్యూల్

 

బిలకూట క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల జనవరి 25న రథసప్తమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరగనున్నది.

రథసప్తమి ప్రత్యేకత

రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి సప్తవాహన సేవలు నిర్వహిస్తారు . ఈ విధంగా ఒకే రోజులో ఏడు వాహన సేవలను నిర్వహించడం ఆలయ చరిత్రలో ఇదే తొలిసారి.

సప్తవాహన సేవల సమయ పట్టిక

రథసప్తమి రోజున జరిగే వాహన సేవల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

  • ఉదయం 5.30 – 8.00 గంటల వరకు – సూర్యప్రభ వాహన సేవ
  • ఉదయం 9.00 – 10.00 గంటల వరకు – పెద్ద శేష వాహన సేవ
  • ఉదయం 11.00 – 12.00 గంటల వరకు – గరుడ వాహన సేవ
  • మధ్యాహ్నం 1.00 – 2.00 గంటల వరకు – హనుమంత వాహన సేవ
  • సాయంత్రం 4.00 – 5.00 గంటల వరకు – కల్పవృక్ష వాహన సేవ
  • సాయంత్రం 6.00 – 7.00 గంటల వరకు – సర్వభూపాల వాహన సేవ
  • రాత్రి 8.00 – 9.00 గంటల వరకు – చంద్రప్రభ వాహన సేవ

No comments