Kondameeda Rayudu Temple: కొండమీద రాయుడు బ్రహ్మోత్సవాలు 2026 – రథోత్సవం, అఖండ దీప దర్శనం వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం నగరానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో, బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని సిద్దరాంపురం రోడ్డు సమీపాన ఉన్న దేవరకొండపై శ్రీలక్ష్మీ సహిత వేంకటేశ్వర స్వామి విరాజిల్లుతున్నారు. ఈ స్వామివారిని భక్తులు ప్రేమగా కొండమీద రాయడు అని పిలుస్తారు.
ఆలయ స్థల విశేషాలు
- బుక్కరాయసముద్రం గ్రామానికి దక్షిణ దిశగా ఒక కిలోమీటరు దూరంలో దేవరకొండ ఉంది.
- ఈ కొండ శిఖరాగ్రాన శ్రీ వేంకటరమణుడు శ్రీలక్ష్మీ దేవితో కలిసి సతీసమేతంగా కొలువుదీరారు.
- కొండపైన సహజసిద్ధంగా ఏర్పడిన రెండు భారీ బండరాళ్ల మధ్య గుహలాంటి ప్రదేశంలో స్వామివారి శిలావిగ్రహం దర్శనమిస్తుంది.
పౌరాణిక – చారిత్రక ప్రాధాన్యం
పూర్వకాలంలో గార్గూయ మహర్షి దేవరకొండపై కఠోర తపస్సు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. మహర్షి తపస్సుకు మెచ్చిన శ్రీ వేంకటేశ్వరుడు ఈ కొండపై ప్రత్యక్షమైనట్లు భక్తుల విశ్వాసం.
- మహర్షి స్వయంగా గుహలో శ్రీ వేంకటేశ్వరుడి శిలావిగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది.
- విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయం విశేషంగా అభివృద్ధి చెందింది.
- విజయనగర రాజులే ఇక్కడ బ్రహ్మోత్సవాలను ప్రారంభించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.
మాఘమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా కొండమీద రాయడిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తులు అచంచల విశ్వాసంతో చెబుతారు.
బ్రహ్మోత్సవాలు – 2026 షెడ్యూల్
జనవరి 25 నుండి దేవరకొండపై శ్రీలక్ష్మీ సహిత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభం కానున్నాయి.
ఉత్సవాల తేదీ వారీ వివరాలు
- జనవరి 25 – బ్రహ్మోత్సవాల ప్రారంభం
- జనవరి 26 – అంకురార్పణ, హోమం, ధ్వజారోహణం, పుష్ప పల్లకి సేవ
- జనవరి 27 – సింహ వాహన సేవ
- జనవరి 28 – శేష వాహన సేవ
- జనవరి 29 – హనుమంత్ వాహన సేవ
- జనవరి 30 – గరుడ వాహన సేవ
- జనవరి 31 – గజ వాహన సేవ
- ఫిబ్రవరి 01 – కల్యాణోత్సవం, సూర్యప్రభ వాహన సేవ, రథోత్సవం
- ఫిబ్రవరి 02 – అశ్వ వాహన సేవ
- ఫిబ్రవరి 03 – వసంతోత్సవం, హంస వాహన సేవ, తీర్థవారి

Post a Comment