Janakampet Lakshmi Narasimha Swamy Temple: జానకంపేట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవం 2026 తేదీలు, ఉత్సవాలు

 

ఎడపల్లి మండలం జానకంపేటలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ బ్రహ్మోత్సవాలు నేటి (సోమవారం) నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు వారం రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోనే ఏకైక అష్టముఖి కోనేరు కలిగిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

బ్రహ్మోత్సవాల కాలం

ప్రతి సంవత్సరం మాఘమాసం శుద్ధ అష్టమి నుంచి మాఘమాసం బహుళ ప్రతిపద వరకు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించబడతాయి.

2026 ఉత్సవ కార్యక్రమాల వివరాలు

జనవరి 26 – 28

  • అధ్యయనోత్సవం
  • ద్రావిడ ప్రబంధ పారాయణం

జనవరి 29

  • స్థాపనము
  • పుణ్యాహవచనం
  • మాతృకా పూజ
  • రక్షాబంధనం
  • అంకురార్పణం
  • హారతి

జనవరి 30

  • శాల ప్రతిష్ఠ
  • వాస్తు హోమం
  • ధ్వజారోహణం
  • యజ్ఞం
  • దేవతా ఆహ్వానం
  • బలిహరణం
  • హారతి
  • మంత్రపుష్పం

జనవరి 31

  • యజ్ఞం
  • బలిహరణం
  • స్వామివారి కల్యాణోత్సవం
  • హోమం

ఫిబ్రవరి 1

  • స్వామివారి రథోత్సవం
  • యజ్ఞం
  • బలిహరణం
  • సాంస్కృతిక కార్యక్రమాలు
  • భజనలు

ఫిబ్రవరి 2

  • చక్రతీర్థం (జాతర)
  • శేష హోమం
  • బలిహరణం
  • సాయంత్రం కుస్తీ పోటీలతో బ్రహ్మోత్సవాల ముగింపు

No comments