అంతర్వేది పార్వతీ నీలకంఠేశ్వరస్వామి కల్యాణోత్సవాలు 2026 | ఉత్సవాలు, పూజలు

 అంతర్వేది క్షేత్రపాలకుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతీ నీలకంఠేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలు ఈ నెల 20 నుంచి 24 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కళకళలాడనుంది.

2026 ఉత్సవాల కార్యక్రమ వివరాలు

జనవరి 20వ తేదీ – అంకురార్పణ

  • రాత్రి 7:00 గంటలకు అంకురార్పణ కార్యక్రమం
  • కల్యాణోత్సవాలకు ఆరంభ సూచికగా ఈ వేడుక నిర్వహణ

జనవరి 21వ తేదీ – దివ్య కల్యాణం

  • నంది వాహనంపై ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం
  • రాత్రి 8:30 గంటలకు శ్రీ పార్వతీ నీలకంఠేశ్వరస్వామి వారి దివ్య కల్యాణోత్సవం

జనవరి 22 & 23వ తేదీలు – ప్రత్యేక పూజలు

  • స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు
  • భక్తులకు విశేష దర్శనాలు

జనవరి 24వ తేదీ – శ్రీ పుష్పోత్సవం

  • స్వామివారికి శ్రీ పుష్పోత్సవం
  • ఉత్సవాలకు ఘనంగా ముగింపు

No comments