Markapuram Lakshmi Chennakesava Temple: మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు 2026 – 16 రోజుల వైభవం


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం తన సాంప్రదాయ శిల్పకళ, ఆధ్యాత్మిక వైభవంతో విశేష ఖ్యాతి పొందింది. ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తాయి.

2026 సంవత్సరానికి గాను ఈ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమై 16 రోజులపాటు వైభవంగా కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాలలో పూజలు, వాహన సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షిస్తాయి.

2026 బ్రహ్మోత్సవాల పూర్తి కార్యక్రమాలు

ఏప్రిల్ 1

  • అంకురార్పణ

ఏప్రిల్ 2

  • ధ్వజారోహణం (ఉదయం 10 గంటలకు)
  • రాయబారం (రాత్రి)
  • ఎదురుకోలు
  • సూర్యప్రభ వాహన సేవ

ఏప్రిల్ 3

  • కళ్యాణోత్సవం (ఉదయం 4 గంటలకు)
  • చంద్రప్రభ వాహన సేవ

ఏప్రిల్ 4 – 10 (వాహన సేవల ప్రత్యేక దినాలు)

  • ఏప్రిల్ 4 – సింహ వాహన సేవ
  • ఏప్రిల్ 5 – శేష వాహన సేవ
  • ఏప్రిల్ 6 – వ్యాళి వాహన సేవ
  • ఏప్రిల్ 7 – పొన్న వాహన సేవ
  • ఏప్రిల్ 8 – హనుమాన్ వాహన సేవ
  • ఏప్రిల్ 9 – గరుడ వాహన సేవ
  • ఏప్రిల్ 10 – గజ వాహన సేవ

ఏప్రిల్ 11

  • రథోత్సవం

ఏప్రిల్ 12 – 13

  • ఏప్రిల్ 12 – అశ్వ వాహన సేవ
  • ఏప్రిల్ 13 – హంస వాహన సేవ

ఏప్రిల్ 14 – 17

  • వసంతోత్సవాలు (వసంతకాల ప్రత్యేక పూజలు, ఉత్సవాలు)

ఏప్రిల్ 18

  • ఊంజల్ సేవ

 ఏప్రిల్ 19

  • 16 రోజుల బ్రహ్మోత్సవాల ముగింపు

ఈ బ్రహ్మోత్సవాలు భక్తులకు భక్తి, భవోద్వేగం, ఆనందం కలగలిపిన అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. ఈ పవిత్ర సమయంలో మార్కాపురం కు విచ్చేసి స్వామివారి దివ్యదర్శనం పొందడం ఎంతో పుణ్యప్రదంగా భావించబడుతుంది.

Comments