Vontimitta Brahmotsavam: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు 2026 – వాహన సేవలు, సీతారామ కల్యాణం, పుష్పయాగం
కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రసిద్ధ క్షేత్రం Sri Kodandarama Swamy Temple, Ontimitta లో శ్రీరామనవమి సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 26 నుండి ఏప్రిల్ 05, 2026 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతారు.
ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి రోజు ఉదయం, రాత్రి వాహన సేవలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తారు.
ముఖ్య కార్యక్రమాలు
- మార్చి 24 – కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- మార్చి 26 – బ్రహ్మోత్సవాల అంకురార్పణ
వాహన సేవల సమయం
బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజూ వాహన సేవలు ఈ సమయాల్లో నిర్వహిస్తారు:
- ఉదయం: 7.30 నుండి 9.30 గంటల వరకు
- రాత్రి: 7 నుండి 9 గంటల వరకు
2026 బ్రహ్మోత్సవాల కార్యక్రమాల వివరాలు
మార్చి 27, 2026
- ఉదయం: ధ్వజారోహణం (ఉదయం 9.30 – 10.15 గంటలు, వృషభ లగ్నం)
- ఉదయం 11 – మధ్యాహ్నం 12: శ్రీరామనవమి ఆస్థానం
- సాయంత్రం 4 గంటల నుండి: పోతన జయంతి, కవి సమ్మేళనం
- రాత్రి: శేష వాహనం
మార్చి 28, 2026
- ఉదయం: వేణుగానాలంకారం
- రాత్రి: హంస వాహనం
మార్చి 29, 2026
- ఉదయం: వటపత్రశాయి అలంకారం
- రాత్రి: సింహ వాహనం
మార్చి 30, 2026
- ఉదయం: నవనీత కృష్ణాలంకారం
- రాత్రి: హనుమంత వాహనం
మార్చి 31, 2026
- ఉదయం: మోహినీ అలంకారం
- రాత్రి: గరుడ సేవ
ఏప్రిల్ 01, 2026
- ఉదయం: శివధనుర్భాణ అలంకారం
- మధ్యాహ్నం 3.15 గంటలకు: కాంత కోరిక, ఎదుర్కోలు ఉత్సవం
- సాయంత్రం 6.30 – రాత్రి 8.30: శ్రీ సీతారాముల కల్యాణోత్సవం
- రాత్రి: గజ వాహనం
ఏప్రిల్ 02, 2026
- ఉదయం: రథోత్సవం
ఏప్రిల్ 03, 2026
- ఉదయం: కాళీయమర్ధన అలంకారం
- రాత్రి: అశ్వ వాహనం
ఏప్రిల్ 04, 2026
- ఉదయం: చక్రస్నానం
- రాత్రి: ధ్వజావరోహణం
ఏప్రిల్ 05, 2026
- సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు: పుష్పయాగం

Post a Comment