Valmidi Sitaramachandra Swamy Temple: వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు 2026 – పూర్తి షెడ్యూల్
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలో వెలసిన వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ప్రాచీనమైన మరియు మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. రామాయణ మహాకావ్య రచయిత వాల్మీకి మహర్షి జన్మస్థలంగా ఈ ప్రాంతం ప్రత్యేక గుర్తింపు పొందింది. అందుకే పూర్వంలో ఈ ప్రాంతాన్ని “వాల్మీకిపురం” అని పిలిచేవారని చెబుతారు.
క్షేత్ర మహిమ
వల్మీడీలో పక్కపక్కనే ఉన్న రెండు గుట్టలు — మునులగుట్ట మరియు దేవునిగుట్ట — ఈ క్షేత్రానికి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతున్నాయి.
మునులగుట్టపై వాల్మీకి మహర్షి తపస్సు చేస్తుండగా ఆయన చుట్టూ పుట్ట ఏర్పడడంతో “వాల్మీకి” అనే పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి.
బ్రహ్మోత్సవాల వివరాలు (మార్చి 23 – ఏప్రిల్ 2, 2026)
ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా భక్తి వైభవంతో జరుగనున్నాయి.
ముఖ్య కార్యక్రమాలు
మార్చి 23
శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తుల గుట్టపై ప్రవేశం
మార్చి 24
ప్రబంధ సేవా కాలం
మార్చి 25
గరుడసేవ
మార్చి 26
బ్రహ్మోత్సవాల అంకురార్పణ
మార్చి 27
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం
మార్చి 28
పొన్నిసేవ, స్వామివారి శ్రీకృష్ణ అలంకరణ
మార్చి 29
సుదర్శన నరసింహ హోమం
మార్చి 30
అశ్వవాహన సేవ
మార్చి 31
పూర్ణాహుతి, శ్రీ చక్రస్నానం
ఏప్రిల్ 01
రథోత్సవం, పారువేట
ఏప్రిల్ 02
ఆలయ ప్రవేశం, ఏకాంత సేవలతో బ్రహ్మోత్సవాల ముగింపు

Comments
Post a Comment