Tirupati Kodanda Rama Brahmotsavam: తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు 2026 – వాహన సేవల పూర్తి షెడ్యూల్
తిరుపతిలోని ప్రసిద్ధ ఆలయం Sri Kodandarama Swamy Temple లో వార్షిక బ్రహ్మోత్సవాలు 2026 మార్చి 17 నుండి 25 వరకు ఘనంగా నిర్వహించబడనున్నాయి. ఈ మహోత్సవాలను Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో వైభవంగా జరుపుతారు.
బ్రహ్మోత్సవాలు భక్తులకు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించే పండుగ. ఈ ఉత్సవాలలో ప్రతిరోజూ వివిధ వాహన సేవలలో శ్రీ కోదండరామస్వామి భక్తులకు దర్శనం ఇస్తారు.
ముఖ్య కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాలకు ముందు కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- మార్చి 13, 2026 – కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- మార్చి 16, 2026 – అంకురార్పణ
వాహన సేవల సమయం
బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలు సాధారణంగా ఈ సమయాల్లో జరుగుతాయి:
- ఉదయం: 8:00 – 9:30
- రాత్రి: 7:00 – 8:30
(కొన్ని ప్రత్యేక వాహన సేవలకు ప్రత్యేక సమయాలు ఉంటాయి)
2026 బ్రహ్మోత్సవాల పూర్తి కార్యక్రమ పట్టిక
మార్చి 17, 2026
- ఉదయం: ధ్వజారోహణం (ఉ. 8 – 9 గంటల వరకు, మేష లగ్నం)
- రాత్రి: పెద్దశేష వాహనం
మార్చి 18, 2026
- ఉదయం: చిన్నశేష వాహనం
- రాత్రి: హంస వాహనం
మార్చి 19, 2026
- ఉదయం: సింహ వాహనం
- మధ్యాహ్నం: ఉగాది ఆస్థానం (మ. 3 – 4 గంటలు)
- రాత్రి: ముత్యపుపందిరి వాహనం
మార్చి 20, 2026
- ఉదయం: కల్పవృక్ష వాహనం
- రాత్రి: సర్వభూపాల వాహనం
మార్చి 21, 2026
- ఉదయం: పల్లకీ ఉత్సవం
- రాత్రి: గరుడ వాహనం (రా. 7 – 11 గంటలు)
మార్చి 22, 2026
- ఉదయం: హనుమంత వాహనం
- మధ్యాహ్నం: వసంతోత్సవం (మ. 3 – 4 గంటలు)
- రాత్రి: గజ వాహనం
మార్చి 23, 2026
- ఉదయం: సూర్యప్రభ వాహనం
- రాత్రి: చంద్రప్రభ వాహనం
మార్చి 24, 2026
- ఉదయం: రథోత్సవం (ఉ. 8:30 గంటలకు)
- రాత్రి: అశ్వ వాహనం
మార్చి 25, 2026
- ఉదయం: చక్రస్నానం (ఉ. 10 గంటలకు)
- రాత్రి: ధ్వజావరోహణం

Post a Comment