Chaitra Masam 2026 festivals: చైత్ర మాసం 2026 పండుగలు, పుణ్య తిధులు – పూర్తి వివరాలు
2026 సంవత్సరం మార్చి 19, గురువారం నుండి చైత్ర మాసం ప్రారంభమవుతోంది. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు చిత్ర నక్షత్రంలో సంచరించడంతో దీనికి చైత్ర మాసం అనే పేరు వచ్చింది. వసంతఋతువు ఆరంభాన్ని సూచించే ఈ మాసం, ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది.
ఈ మాసంలో అనేక పండుగలు, వ్రతాలు, ఉత్సవాలు జరగనున్నాయి. వాటిని తేదీల వారీగా చూద్దాం:
చైత్ర శుద్ధ పక్షం (శుక్ల పక్షం)
మార్చి 19, గురువారం – పాడ్యమి
ఉగాది (తెలుగు సంవత్సరాది)
మార్చి 20, శుక్రవారం – విదియ
చంద్ర దర్శనం
ఉమా శివాగ్ని పూజ
బాలేందు వ్రతం
మార్చి 21, శనివారం – తదియ
సౌభాగ్య గౌరీ వ్రతం
తిరుపతి శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం గరుడ వాహన సేవ
మార్చి 22, ఆదివారం – చవితి
గణపతి దమన పూజ
మార్చి 25, బుధవారం – పంచమి
తిరుపతి శ్రీ కోదండరామ స్వామి చక్రస్నానం
బ్రహ్మోత్సవాల ముగింపు
మార్చి 26, గురువారం – అష్టమి
భవాని అష్టమి
మార్చి 27, శుక్రవారం – నవమి
శ్రీరామనవమి
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు
సమర్థ రామదాసు జయంతి
మార్చి 28, శనివారం – దశమి
శ్రీరామ పట్టాభిషేకం
ధర్మరాజ దశమి
మార్చి 29, ఆదివారం – ఏకాదశి
కామదా ఏకాదశి
మార్చి 30, సోమవారం – ద్వాదశి
వామన ద్వాదశి
పక్ష ప్రదోషం
మార్చి 31, మంగళవారం – త్రయోదశి/చతుర్దశి
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవం
ఏప్రిల్ 1, బుధవారం – చతుర్దశి/పౌర్ణమి
ఒంటిమిట్ట రథోత్సవం
తుంబురు తీర్థం ముక్కోటి
ఏప్రిల్ 2, గురువారం – పౌర్ణమి
హనుమాన్ జయంతి
హనుమత్ విజయోత్సవం
చిత్రగుప్త వ్రతం
చైత్ర బహుళ పక్షం (కృష్ణ పక్షం)
ఏప్రిల్ 5, ఆదివారం – చవితి
సంకష్టహర చవితి
ఏప్రిల్ 7, మంగళవారం – పంచమి
మత్స్య జయంతి
ఏప్రిల్ 13, సోమవారం – ఏకాదశి
వరూధిని ఏకాదశి
ఏప్రిల్ 14, మంగళవారం – ద్వాదశి
తమిళ సంవత్సరాది
ఏప్రిల్ 15, బుధవారం – త్రయోదశి
పక్ష ప్రదోషం
మేష సంక్రమణం
విషు
ఏప్రిల్ 16, గురువారం – చతుర్దశి
మాస శివరాత్రి
ఏప్రిల్ 17, శుక్రవారం – అమావాస్య
చైత్ర మాసం సమాప్తి

Post a Comment