Arasavalli Kalyanotsavam 2026 Schedule: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు 2026 – పూర్తి షెడ్యూల్
శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం లో స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
2026 ఉత్సవాల ముఖ్య కార్యక్రమాలు
- మార్చి 25 – కల్యాణాంగ ధ్వజారోహణం
- మార్చి 28 – సుగంధ ద్రవ్య మర్దన, ఉత్సవ సంప్రదాయ కీర్తనలు
-
మార్చి 29, ఆదివారం రాత్రి
- స్వామివారి తిరువీధి
- అనంతరం ఉషా, ఛాయ, పద్మినీ దేవులతో కల్యాణ మహోత్సవం
- సోమవారం – ఆగ్నేయ స్థాలీపాక హోమాలు
-
మంగళవారం ఉదయం 8 గంటలకు
- మహదాశీర్వచనం
- సదస్యం
- పండిత సత్కారం
- వేద సదస్సు
- ఏప్రిల్ 1 రాత్రి 7 గంటలకు – తిరుమంగయాళ్వారుల చరిత్ర, సంవాదం
- ఏప్రిల్ 2 (గురువారం)
- ధ్వజావరోహణం
- పుష్పయాగ మహోత్సవం
- ఏకాంత సేవ
- ఉత్సవ సంప్రదాయ కీర్తనలు
సూర్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవం భక్తులకు అత్యంత పుణ్యప్రదమైనది. ఉషా, ఛాయ, పద్మినీ దేవులతో జరిగే ఈ దివ్య కల్యాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Comments
Post a Comment