భక్తులు కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ లోని వివేకానందనగర్ వేంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల కోసం శోభాయమానంగా ముస్తాబైంది. నగర భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిన ఈ ఆలయం, విశేషమైన సేవలు మరియు సంప్రదాయ పూజలతో ప్రసిద్ధి చెందింది.
ఆలయ చరిత్ర
స్థానికంగా వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలనే సంకల్పంతో 1987లో కాలనీ వ్యవస్థాపకులు వడ్డేపల్లి నర్సింగరావు, కృష్ణారెడ్డి తదితరులు ముందుకు వచ్చారు.
1988లో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగగా, 1991 మార్చిలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది.
తక్కువ కాలంలోనే ఈ ఆలయం భక్తుల ఆదరణను పొందింది. నిత్య పూజలు, అభిషేకాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిరంతరం నిర్వహించబడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.
ఆలయ ప్రత్యేకతలు
- అర్చన, పూజలకు ఎటువంటి రుసుం ఉండదు
- దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడి గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు
- కార్తిక మాసంలో కోటి దీపోత్సవం ఘనంగా జరుగుతుంది
- ప్రతి సోమవారం అన్నసమారాధన నిర్వహించడం విశేషం
ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి గరుడ ప్రసాదం కోసం నగరం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు.
ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఐదు రోజులపాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, ప్రధాన అర్చకులు కోసూరి రామకృష్ణమాచార్యులు మరియు రాఘవాచార్యుల పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించబడనున్నాయి.
మార్చి 23
- విష్వక్సేన పూజ
- పుణ్యాహవాచనం
- శ్రీవారు, అమ్మవార్లకు పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా అలంకరణ
- సాయంత్రం స్వామివారి ఊరేగింపు
మార్చి 24
- శ్రీవారి అష్టోత్తర కలశస్థాపన
- రాత్రి శేష వాహన సేవ
- సాంస్కృతిక కార్యక్రమాలు
మూడో రోజు (ఈ నెల 25)
- శాంతి కల్యాణం
నాలుగో రోజు (ఈ నెల 26)
- సుదర్శన హోమం
- రథోత్సవం
ఐదో రోజు (ఈ నెల 27 – శ్రీరామనవమి)
- సీతారాముల కల్యాణం
- సూర్యప్రభ వాహనంపై స్వామివారి ఊరేగింపు
- రామాయణ నాటక ప్రదర్శన
Comments
Post a Comment