తెలంగాణలోని చిలుకూరు బాలాజీ దేవాలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర క్షేత్రం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉన్న ఈ దేవాలయం “వీసా బాలాజీ”గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామివారిని దర్శించుకునే భక్తులు కోరికలు నెరవేరుతాయని గాఢ విశ్వాసంతో వేల సంఖ్యలో తరలి వస్తారు.
ప్రతి సంవత్సరం శ్రీరామనవమి అనంతరం రోజు ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలు ఆధ్యాత్మిక ఉల్లాసంతో పాటు సాంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబిస్తాయి.
2026 సేవల వివరాలు
మార్చి 27 - సెల్వర్ కుతూ ఉత్సవం, అంకురార్పణం
మార్చి 28 - ధ్వజారోహణ, శేష వాహన సేవ
మార్చి 29 - గోపా వాహన సేవ, హనుమంత వాహన సేవ
మార్చి 30 - సూర్యప్రభ వాహన సేవ, కల్యాణోత్సవం, గరుడ వాహన సేవ
మార్చి 31 - వసంతోత్సవం, గజ వాహన సేవ
ఏప్రిల్ 01 - పల్లకి సేవ, రథోత్సవం
ఏప్రిల్ 02 - ఆస్థాన సేవ, అశ్వ వాహన సేవ
ఏప్రిల్ 03 - చక్ర తీర్థం. ధ్వజావరోహణం
హైదరాబాద్ నగరం నుండి చిలుకూరు వరకు మంచి రోడ్డు సదుపాయం ఉంది.
- మెహిదీపట్నం నుండి మొయినాబాద్ దిశగా వెళ్లే TSRTC బస్సులు తరచుగా నడుస్తాయి
- మెహిదీపట్నం → అజీజ్‌నగర్ → మొయినాబాద్ → చిలుకూరు మార్గం సాధారణంగా ఉపయోగిస్తారు
- ప్రైవేట్ క్యాబ్‌లు, స్వంత వాహనాలతో కూడా సులభంగా చేరుకోవచ్చు
హైదరాబాద్ నగరం నుండి దూరం: సుమారు 25 కి.మీ.

Comments
Post a Comment