Rajamahendravaram Somalamma Temple: రాజమహేంద్రవరం పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయం వార్షిక జాతర మహోత్సవాలు 2026 పూర్తి కార్యక్రమ వివరాలు


ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన రాజమహేంద్రవరంలో నగర దేవతగా భక్తుల ఆరాధనలు అందుకుంటున్న పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయం వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల 26 నుంచి మార్చి 2 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

శ్యామలానగర్‌లో కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ జాతర కాలంలో వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఊరేగింపులు జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

2026 ఉత్సవాల పూర్తి కార్యక్రమ వివరాలు

ఫిబ్రవరి 26 – దశమి (జాతర ప్రారంభం)

  • తెల్లవారుజామున 4 గంటలకు పంచామృతాభిషేకం
  • విశేష అలంకారం
  • ఉదయం 10:10 గంటలకు కలశస్థాపన
  • 10:30 గంటలకు లక్ష్మీ గణపతి హోమం
  • సాయంత్రం 7 గంటల నుంచి శ్రీ ఉమా నృత్యనికేతన్ శిష్యబృందం చేత కూచిపూడి నృత్య ప్రదర్శన

ఫిబ్రవరి 27

  • ఉదయం 8 గంటలకు చండీ హోమం
  • సాయంత్రం 6 గంటలకు కూచిపూడి నృత్యం
  • రాత్రి 7 గంటలకు సహస్ర జ్యోతిర్లింగార్చన

ఫిబ్రవరి 28

  • ఉదయం 8:30 గంటలకు లక్ష పుష్పార్చన
  • సాయంత్రం 6 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి గానామృతం

 మార్చి 1

  • ఉదయం 9 గంటలకు సౌభాగ్య వ్రతం
  • సాయంత్రం 6 గంటలకు శ్రీమహా గురుస్థాన్ క్షేత్రం వారిచే:

  • అమ్మవారి పల్లకీ సేవ
  • ఊయల సేవ
  • సాయిబాబా భజనలు

మార్చి 2 – జాతర మహోత్సవం

  • తెల్లవారుజామున 4 గంటలకు పంచామృతాభిషేకం
  • విశేష అలంకారం
  • మధ్యాహ్నం 3 గంటల నుంచి:

  • గరగల నృత్యాలు
  • కాళీ నృత్యం
  • అమ్మవారి వేషధారణలు
  • మేళతాళాలతో నగర వీధుల్లో వైభవమైన ఊరేగింపు

కుంకుమ పూజల సమయాలు

ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు ప్రతిరోజూ:

  • ఉదయం: 8 గంటల నుంచి 12 గంటల వరకు
  • సాయంత్రం: 5 గంటల నుంచి 8 గంటల వరకు

ఆలయ ఆవరణలోని ప్రత్యేక వేదికపై కుంకుమ పూజలు నిర్వహించబడతాయి.

No comments