Kuravi Veerabhadra Swamy Temple: కురవి శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం మహాశివరాత్రి జాతర & కల్యాణ మహోత్సవాలు 2026

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం, కురవిలో జరిగే వార్షిక జాతర మరియు శ్రీ వీరభద్రస్వామి – భద్రకాళిమాత కల్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశముండటంతో దేవస్థాన అధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం

ఫిబ్రవరి 14 – అంకురార్పణ
శనివారం సాయంత్రం 7 గంటలకు అంకురార్పణ కార్యక్రమంతో జాతర ప్రారంభమవుతుంది.

ఫిబ్రవరి 15 – మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు

  • ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు పూర్ణాభిషేకాలు
  • రాత్రి 7 గంటలకు గ్రామసేవ, ఎదురుకోలు
  • తెల్లవారుజామున 1:50 గంటలకు భద్రకాళి సమేత వీరభద్రస్వామి దివ్య కల్యాణం

తరువాతి ఉత్సవాల వివరాలు

ఫిబ్రవరి 16 – 18
ప్రతిరోజూ అభిషేకాలు, హోమాలు, గ్రామసేవలు నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 18
సాయంత్రం 6:30 గంటలకు కురవి పెద్ద చెరువులో తెప్పోత్సవం.

ఫిబ్రవరి 20
సాయంత్రం 6 గంటలకు రథోత్సవం.

ఫిబ్రవరి 21

  • ఉదయం 10:30 గంటలకు పూర్ణాహుతి
  • సాయంత్రం 4 గంటలకు బండ్లు తిరుగే కార్యక్రమం, పారువేట

ఫిబ్రవరి 22
ఉదయం వసంతోత్సవం, సాయంత్రం ఏకాంతసేవ, నాగవెల్లి పూజ.

ఫిబ్రవరి 23
స్వామివారి పవళింపుసేవ.

ఫిబ్రవరి 27
పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణం.

మార్చి 1
పదహారు రోజుల పండుగ పూజలతో మహోత్సవాలు ముగుస్తాయి.

No comments