Magha Month 2026 Festivals: 2026 మాఘ మాసం శుభతిథులు, పండుగలు, వ్రతాలు పూర్తి వివరాలు

 

జనవరి 19, సోమవారం నుంచి పవిత్రమైన మాఘ మాసం ప్రారంభం కానుంది.

చంద్రుడు మఘ నక్షత్రంలో ఉండే మాసం కావడంతో దీనికి మాఘ మాసం అనే పేరు వచ్చింది.
‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘ మాసం అత్యంత శ్రేష్ఠమైనదిగా శాస్త్రాలు చెబుతాయి. మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కావడంతో ఈ మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది.

శుభకార్యాల మాసం

సాధారణంగా మాఘ మాసంలో వివాహాది శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. అందుకే దీనిని శుభకార్యాల మాసం అని అంటారు.
అయితే ఈ ఏడాది మూఢమి కారణంగా మాఘ మాసంలో వివాహ ముహూర్తాలు లేవు. అయినప్పటికీ ఈ మాసంలో అనేక పుణ్య తిథులు, వ్రతాలు ఉన్నాయి.

శుద్ధ పక్ష తిథులు

జనవరి 19 (సోమవారం)
→ మాఘ శుద్ధ పాడ్యమి | మాఘ మాస ఆరంభం

జనవరి 20 (మంగళవారం)
→ మాఘ శుద్ధ విదియ | చంద్ర దర్శనం

జనవరి 21 (బుధవారం)
→ మాఘ శుద్ధ తదియ | లలితా వ్రతం, హర తృతీయ వ్రతం

జనవరి 22 (గురువారం)
→ మాఘ శుద్ధ చవితి | గణేశ పూజ, శివ పూజ, నాగ ప్రతిష్ఠ సుముహూర్తం

జనవరి 23 (శుక్రవారం)
→ మాఘ శుద్ధ పంచమి | శ్రీ పంచమి, వసంత పంచమి, సరస్వతీ పూజ

జనవరి 24 (శనివారం)
→ మాఘ శుద్ధ షష్టి | విశోక షష్టి, మందార షష్టి, రామ షష్టి, వరుణ షష్టి

జనవరి 25 (ఆదివారం)
→ మాఘ శుద్ధ సప్తమి | రథసప్తమి, సూర్య పూజ

జనవరి 26 (సోమవారం)
→ మాఘ శుద్ధ అష్టమి | భీష్మాష్టమి, 

జనవరి 27 (మంగళవారం)
→ మాఘ శుద్ధ నవమి | మధ్వ నవమి, నందిని పూజ

జనవరి 28 (బుధవారం)
→ మాఘ శుద్ధ దశమి / ఏకాదశి | అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం

జనవరి 29 (గురువారం)
→ మాఘ శుద్ధ ఏకాదశి | భీష్మ ఏకాదశి, అంతర్వేది తీర్థం

జనవరి 30 (శుక్రవారం)
→ మాఘ శుద్ధ ద్వాదశి / త్రయోదశి | వరాహ ద్వాదశి, పక్ష ప్రదోషం, 

ఫిబ్రవరి 1 (ఆదివారం)
→ మాఘ శుద్ధ పౌర్ణమి | మాఘ పౌర్ణమి, నదీ/సముద్ర స్నానం, సతీదేవి జయంతి, సత్యనారాయణ వ్రతం

బహుళ పక్ష తిథులు

ఫిబ్రవరి 2 (సోమవారం)
→ మాఘ బహుళ పాడ్యమి | సౌభాగ్య వ్రతం

ఫిబ్రవరి 5 (గురువారం)
→ మాఘ బహుళ చవితి | సంకష్టహర చవితి

ఫిబ్రవరి 8 (ఆదివారం)
→ మాఘ బహుళ సప్తమి | సప్తమి వ్రతం, భాను సప్తమి, సూర్య వ్రతాలు

ఫిబ్రవరి 9 (సోమవారం)
→ మాఘ బహుళ అష్టమి | మంగళ వ్రతం

ఫిబ్రవరి 13 (శుక్రవారం)
→ మాఘ బహుళ ఏకాదశి | విజయ ఏకాదశి (రామసేతు నిర్మాణ తిథి)

ఫిబ్రవరి 14 (శనివారం)
→ మాఘ బహుళ ద్వాదశి / త్రయోదశి | తిల ద్వాదశి, పక్ష ప్రదోషం

ఫిబ్రవరి 15 (ఆదివారం)
→ మాఘ బహుళ త్రయోదశి / చతుర్దశి | మహాశివరాత్రి

ఫిబ్రవరి 17 (మంగళవారం)
→ మాఘ బహుళ అమావాస్య | ధర్మ అమావాస్య, పితృ శ్రాద్ధాలు
మాఘ మాస సమాప్తి

No comments