ప్రసిద్ధి గాంచిన కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 29వ తేదీ నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏటా కల్యాణోత్సవాలకు నెల రోజుల ముందు ‘తిరునాళ్లు’ పేరుతో ఈ ఉత్సవాలను పూర్వ సంప్రదాయంగా నిర్వహిస్తారు.
2026 ఉత్సవాల వివరాలు:
- జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి అధ్యయనోత్సవాలు
- ఫిబ్రవరి 3, 4 తేదీలు శ్రీ రంగనాథ స్వామికి అధ్యయనోత్సవాలు
- ఫిబ్రవరి 5, 6 తేదీలు శ్రీ అనంత పద్మనాభ స్వామికి అధ్యయనోత్సవాలు
మొదటి ఐదు రోజుల పాటు గరుడ, ఆంజనేయ, గజ, అశ్వ, శేష వాహనాలపై స్వామివారి గ్రామోత్సవాలు నిర్వహిస్తారు.
అలాగే ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం కొండపై, అదే రోజు రాత్రి రంగనాథ స్వామి ఆలయంలో బేడా ఉత్సవం ఘనంగా జరగనుంది.
