శ్రీరామ జననం
చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరాముడు అవతరించాడు. ఈ రోజునే మనం శ్రీరామనవమిగా ఘనంగా జరుపుకుంటాం.
అహల్య శాప విమోచనం
గౌతమ మహర్షి శాపంతో శిలగా మారిన అహల్యను శ్రీరాముడు తన పాదస్పర్శతో విముక్తి కలిగించాడు. ఈ పవిత్ర సంఘటన కూడా చైత్రమాసంలోనే జరిగినట్లు చెబుతారు.
వనవాస ప్రారంభం
అయోధ్యను విడిచి, ధర్మాన్ని నిలబెట్టేందుకు శ్రీరాముడు వనవాసానికి బయలుదేరినది కూడా ఈ మాసంలోనే.
గుహుడి సహాయం
అరణ్యవాసంలో గుహుడు సహాయంతో శ్రీరాముడు, సీతా, లక్ష్మణులు గంగానదిని దాటిన ఘట్టం చైత్రమాసంలో జరిగింది.
దశరథ మహారాజు మరణం
దశరథ మహారాజు తన కుమారుడి వియోగాన్ని తట్టుకోలేక ఈ మాసంలోనే పరమపదించారు.
సీతాదేవి అపహరణ
రావణుడు సీతాదేవిని అపహరించిన సంఘటన కూడా చైత్రమాసంలోనే చోటుచేసుకున్నదిగా పురాణాలు చెబుతున్నాయి.
విభీషణ పట్టాభిషేకం
లంకలో ధర్మాన్ని స్థాపిస్తూ విభీషణుడు కు శ్రీరాముడు పట్టాభిషేకం చేసిన ఘట్టం కూడా ఈ మాసానికే చెందినది.
అయోధ్యకు తిరిగి చేరిక
రావణ సంహారం అనంతరం శ్రీరాముడు సీతాదేవితో కలిసి అయోధ్యకు తిరిగి చేరినదీ చైత్రమాసంలోనే జరిగిన మహత్తర సంఘటన.

Comments
Post a Comment