వైశాఖ మాసంను మాధవ మాసం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. “మాధవుడు” అనేది శ్రీ మహావిష్ణువు యొక్క నామం. అందువల్ల ఈ మాసం దానధర్మాలు, పుణ్యకార్యాలు, పర్వదినాలతో అత్యంత పవిత్రమైన కాలంగా భావించబడుతుంది.
ఈ మాసంలో స్నానం, జపం, దానం, వ్రతాలు ఆచరించడం ద్వారా అనేక పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు పేర్కొంటాయి.
వైశాఖ మాసం (2026)
- ప్రారంభం: ఏప్రిల్ 18, 2026 (శనివారం)
- ముగింపు: మే 16, 2026 (శనివారం)
తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర మాసం తరువాత వచ్చే రెండవ మాసమే వైశాఖం.
2026 వైశాఖ మాసంలోని ముఖ్య పర్వదినాలు
శుక్ల పక్షం (శుద్ధ పక్షం)
- ఏప్రిల్ 18 – శుద్ధ పాడ్యమి (మాస ప్రారంభం)
- ఏప్రిల్ 19 – విదియ (చంద్రోదయం)
-
ఏప్రిల్ 20 – తదియ
- అక్షయ తృతీయ
- పరశురాముడు జయంతి
- సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం చందనోత్సవం
- చార్ ధామ్ యాత్ర ప్రారంభం
-
ఏప్రిల్ 21 – చవితి
- ఆది శంకరాచార్యులు జయంతి
-
ఏప్రిల్ 22 – పంచమి
- రామానుజాచార్యులు జయంతి
-
ఏప్రిల్ 25 – నవమి
- తిరుమలలో పద్మావతి–శ్రీనివాసుల పరిణయోత్సవాలు ప్రారంభం
-
ఏప్రిల్ 26 – దశమి
- పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి
- వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి
-
ఏప్రిల్ 27 – ఏకాదశి
- మోహిని ఏకాదశి
- అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం కల్యాణోత్సవం
-
ఏప్రిల్ 28 – ద్వాదశి
- శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం బుగ్గోత్సవం ప్రారంభం
-
ఏప్రిల్ 29 – త్రయోదశి
- దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం తెప్పోత్సవం ప్రారంభం
-
ఏప్రిల్ 30 – చతుర్దశి
- శ్రీ నరసింహ స్వామి జయంతి
- మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి
-
మే 01 – పౌర్ణమి
- బుద్ధ పూర్ణిమ
- కూర్మ అవతారం జయంతి
కృష్ణ పక్షం (బహుళ పక్షం)
-
మే 02 – పాడ్యమి
- అన్నమాచార్య జయంతి
-
మే 05 – చవితి
- తిరుపతి గంగ జాతర
- సంకష్ట చతుర్థి
-
మే 10 – అష్టమి
- మదర్స్ డే
-
మే 11 – నవమి
- పాంచాహ్నిక కళ్యాణోత్సవాలు ప్రారంభం
-
మే 12 – దశమి
- హనుమంతుడు జయంతి
-
మే 13 – ఏకాదశి
- అపర ఏకాదశి
-
మే 14 – ద్వాదశి/త్రయోదశి
- పక్ష ప్రదోషం
-
మే 15 – చతుర్దశి
- మాస శివరాత్రి
-
మే 16 – అమావాస్య
- వైశాఖ మాసం ముగింపు
వైశాఖ మాస ఆచరణ ప్రాముఖ్యం
- స్నానం, దానం, జపం, ఉపవాసం చేయడం విశేష పుణ్యదాయకం
- గంగాస్నానం, తీర్థస్నానం అత్యంత శ్రేష్ఠం
- అన్నదానం, జలదానం చేయడం మహాపుణ్యం
వైశాఖ మాసం అనేది పర్వదినాలతో, పుణ్య తిధులతో నిండిన పవిత్ర కాలం. ఈ మాసంలో శాస్త్రోక్తంగా పూజలు, వ్రతాలు, దానధర్మాలు ఆచరించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.
