Simhachalam Temple: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం చైత్ర మాస ఉత్సవాలు 2026 – పూర్తి షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం లో చైత్ర మాసం సందర్భంగా విస్తృతంగా ఆధ్యాత్మిక ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి.
చైత్ర శుక్ల పాడ్యమి (మార్చి 19) నుంచి చైత్ర బహుళ అమావాస్య (ఏప్రిల్ 17) వరకు సింహాద్రినాథుని సన్నిధిలో పలు విశిష్ట కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి.
2026 ముఖ్య ఉత్సవాల విశేషాలు
మార్చి 24 – అష్టాక్షరీ మంత్ర హవనం
రోహిణీ నక్షత్రం సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి సన్నిధిలో అష్టాక్షరీ మంత్ర హవనం నిర్వహించబడుతుంది.
మార్చి 27 – సీతారాముల కల్యాణం
శ్రీరామనవమి సందర్భంగా గంగధార సమీపంలోని సీతారామస్వామి ఆలయంలో శ్రీరాముడు – సీతాదేవి దివ్య కల్యాణం ఘనంగా జరుగుతుంది.
మార్చి 28 – బ్రహ్మోత్సవాల ఆరంభం
- అంకురార్పణ
- మత్యగ్రహణం
- రుత్విక్వరణం
- సాయంత్రం కొట్నాల ఉత్సవం
- గరుడ ధ్వజారోహణం
- రథోత్సవం
- రాత్రి కల్యాణ మహోత్సవం
మార్చి 30 – శేషవాహన సేవ
స్వామివారు శేషవాహనంపై తిరువీధుల్లో విహరిస్తారు.
మార్చి 31 – సదస్సులు & వాహనసేవ
- ఉదయం వైదిక సదస్యం
- సాయంత్రం పండిత సదస్యం
- సర్వజన మనోరంజని వాహనంపై గ్రామోత్సవం
- ఆండాళ్ తిరునక్షత్ర పూజలు
ఏప్రిల్ 1 – నారసింహ మాస జయంతి
నరసింహ స్వామి జయంతి సందర్భంగా సూర్యప్రభ వాహనంపై ఊరేగింపు నిర్వహిస్తారు.
ఏప్రిల్ 2 – పూర్ణాహుతి & వసంతోత్సవం
- పూర్ణాహుతి
- అవబృతోత్సవం
- చూర్ణోత్సవం
- వసంతోత్సవం
- రాత్రి దొంగదోపు ఉత్సవం
ఏప్రిల్ 3 – పుష్పయాగం
- ఉదయం వినోదోత్సవం (ఉంగరపుసేవ)
- రాత్రి పుష్పయాగం
ఏప్రిల్ 5 – తిరునక్షత్ర పూజలు
నమ్మాళ్వార్ తిరునక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఏప్రిల్ 12 – సుదర్శన హవనం
కొండదిగువ వెంకన్న సన్నిధిలో శ్రవణ నక్షత్రం సందర్భంగా సుదర్శన హవనం నిర్వహిస్తారు.
ఏప్రిల్ 13 – చందనం అరగదీత ప్రారంభం
చైత్ర బహుళ ఏకాదశి సందర్భంగా చందనం అరగదీతకు సాన ముహూర్తం నిర్వహిస్తారు.
ఏప్రిల్ 17 – ఉత్సవాల ముగింపు
చైత్ర బహుళ అమావాస్య రోజున గ్రామ బలిహరణతో ఉత్సవాలు ముగుస్తాయి.

Comments
Post a Comment