Nandavaram Chowdeswari Ugadi 2026: నందవరం చౌడేశ్వరి దేవి ఉగాది బ్రహ్మోత్సవాలు 2026 – పూర్తి కార్యక్రమ వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన శక్తిపీఠాలలో ఒకటైన నందవరం చౌడేశ్వరి దేవి ఆలయం లో ఉగాది బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ ఉత్సవాలు మార్చి 19 నుంచి మార్చి 25 వరకు నందవరం గ్రామంలో ఘనంగా జరగనున్నాయి. రాయభారం, జ్యోతి మహోత్సవం, రథోత్సవం, వసంతోత్సవం వంటి అనేక విశిష్ట కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.
2026 ఉత్సవాల పూర్తి కార్యక్రమ వివరాలు
మార్చి 19 – గురువారం
- గణపతి పూజ
- పుణ్యాహవాచనం
- అంకురార్పణ
- పంచాంగ శ్రవణం
- సాయంత్రం 5 గంటలకు ఆలయం చుట్టూ పన్నేరపు బండ్లు తిప్పడం
- సాయంత్రం 6:30 గంటలకు ప్రాకార రథోత్సవం
- సాంస్కృతిక కార్యక్రమాలు
మార్చి 20 – శుక్రవారం
- రాత్రి 9 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి కల్యాణం
- రాత్రి గ్రామోత్సవం
మార్చి 21 – శనివారం
- ఉదయం అమ్మవారికి కుంకుమార్చన
- సాయంత్రం 4 గంటలకు రాయభార మహోత్సవం
- రాత్రి పౌరాణిక నాటకాలు
మార్చి 22 – ఆదివారం
- ఉదయం సహస్రనామ కుంకుమార్చన
- పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ
- రాత్రి 12 గంటలకు దిష్టి చుక్క కార్యక్రమం
- రాత్రి 1 గంటకు జ్యోతి మహోత్సవం
మార్చి 23 – సోమవారం
- సాయంత్రం 4 గంటలకు రథోత్సవం (పోవడం)
మార్చి 24 – మంగళవారం
- సాయంత్రం 4 గంటలకు రథోత్సవం (రావడం)
మార్చి 25 – బుధవారం
- ఉదయం వసంతోత్సవం
- ఉత్సవాల ముగింపు
భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశముంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
- షామియానాలు మరియు చలువ పందిళ్లు
- తాగునీటి సదుపాయం
- వైద్య శిబిరాలు
- భద్రత కోసం పోలీసు బందోబస్తు

Post a Comment