Joginath Swamy Jatara 2026: జోగినాథ గుట్ట శ్రీ జోగినాథ స్వామి జాతర 2026 – పూర్తి ఉత్సవాల షెడ్యూల్

భక్తుల కోరికలు తీర్చే భక్తసులభుడు, జోగిపేట ప్రజల ఆరాధ్యదైవమైన శ్రీ జోగినాథ స్వామి వైక్రాంత గిరి (జోగినాథ గుట్ట)పై వెలసి భక్తులకు దర్శనమిస్తున్నాడు.

ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పంచమి నుంచి ప్రారంభమయ్యే ఈ జాతర ఉత్సవాలు ఈసారి మార్చి 23 నుంచి ప్రారంభమై పది రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి.

2026 ఉత్సవాల విశేషాలు

ఈ పది రోజుల జాతరలో భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించే అనేక విశిష్ట కార్యక్రమాలు నిర్వహించబడతాయి.

మార్చి 23 – అంకురార్పణ

  • గణపతి పూజతో ఉత్సవాల ఆరంభం
  • అఖండ దీపారాధన
  • గరుడ గంగా స్నానం (మంజీరా నది నీటితో అభిషేకం)

మార్చి 25 – రథ శిఖర స్థాపన

రథోత్సవానికి ముఖ్యమైన ఘట్టమైన రథ శిఖర స్థాపన వైభవంగా నిర్వహిస్తారు.

మార్చి 28 – మహారధోత్సవం

జాతరలో అత్యంత ముఖ్యమైన కార్యక్రమం మహారథోత్సవం. భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు.

మార్చి 29 – బండ్ల ఊరేగింపు

  • బండ్ల ఊరేగింపు
  • పద్మశాలీలచే సెల్లా వేయుట

ఈ కార్యక్రమాలు ప్రాంతీయ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి.

మార్చి 30 – అగ్నిగుండ ప్రవేశం

భక్తులు తమ భక్తిని చాటుకునే విధంగా అగ్నిగుండంలో ప్రవేశించే విశిష్ట ఆచారం నిర్వహిస్తారు.

మార్చి 31 – శివపార్వతుల కల్యాణం

శివుడుపార్వతీదేవి దివ్య కల్యాణ మహోత్సవం భక్తులను భక్తిరసంలో ముంచెత్తుతుంది.

ఏప్రిల్ 1 – లంకాదహనం

అర్ధరాత్రి సమయంలో నిర్వహించే లంకాదహనం (రావణ దహనం) ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణ.

ఏప్రిల్ 2 – ఉత్సవ ముగింపు

  • కుంకుమార్చనలు
  • రుద్రాభిషేకాలు

ఈ కార్యక్రమాలతో జాతర ఉత్సవాలు ఘనంగా ముగుస్తాయి.

Comments