Beechupalli Kodandarama Temple: బీచుపల్లి శ్రీ కోదండరామాలయం బ్రహ్మోత్సవాలు 2026 – పూర్తి షెడ్యూల్

పవిత్ర కృష్ణా నది తీరాన వెలసిన బీచుపల్లి శ్రీ కోదండరామాలయం లో ఈనెల 24వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఆరు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచనున్నాయి.

2026 ఉత్సవాల షెడ్యూల్

మార్చి 24 – అంకురార్పణ

  • ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
  • సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాల ఆరంభం

మార్చి 25 – ధ్వజారోహణం

  • ధ్వజారోహణం ద్వారా బ్రహ్మోత్సవాల ప్రారంభం
  • శ్రీలక్ష్మీ హయగ్రీవ హోమం నిర్వహణ

మార్చి 26 – హోమాలు

  • ధన్వంతరి హోమం
  • సుదర్శన హోమం
    ఈ హోమాలు ఆరోగ్యం, శాంతి కోసం ప్రత్యేకంగా నిర్వహించబడతాయి.

మార్చి 27 – సీతారాముల కల్యాణం

  • ఉదయం 10 గంటలకు శ్రీరాముడుసీతాదేవి దివ్య కల్యాణ మహోత్సవం
  • సాయంత్రం రథోత్సవం
  • అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ

మార్చి 28 – పట్టాభిషేకం

శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం భక్తులను ఆకట్టుకునే ప్రధాన కార్యక్రమం.

మార్చి 29 – చక్రస్నానం & ముగింపు

  • చక్రస్నానం
  • మహాపూర్ణాహుతి
  • ధ్వజావరోహణంతో ఉత్సవాల ముగింపు

Comments