Srirangapuram Ranganayaka Swamy Temple: శ్రీరంగాపురం రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలు 2026 – ఉత్సవ షెడ్యూల్, విశేషాలు

శ్రీరంగాపురం రంగనాయకస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 25 నుంచి వైభవంగా ప్రారంభంకానున్నాయి.

2026 ఉత్సవాల కార్యక్రమ వివరాలు

ఫిబ్రవరి 25 – కొయిలాళ్వార్ తిరుమంజనం, విష్వక్సేన పూజ, పుణ్యహవాచనం, అంకురార్పణ
ఫిబ్రవరి 26 – ధ్వజారోహణం
ఫిబ్రవరి 27 – హోమం, సూర్యప్రభ వాహన సేవ
ఫిబ్రవరి 28 – శేషవాహన సేవ
మార్చి 1 – హనుమంత వాహన సేవ, మంటపోత్సవం
మార్చి 2 – మోహిని అలంకరణ, గరుడ వాహన సేవ, స్వామివారి కల్యాణోత్సవం
మార్చి 3 – గజవాహన సేవ
మార్చి 4 – రథోత్సవం
మార్చి 5 – పారువేట ఉత్సవం, అశ్వవాహన సేవ
మార్చి 6 – పూర్ణాహుతి, ధ్వజావరోహణం

ఎలా చేరుకోవాలి?

బస్సు మార్గం:
వనపర్తి, కోల్లాపూర్ పట్టణాల నుంచి శ్రీరంగాపురానికి తరచుగా బస్సులు నడుస్తుంటాయి. గ్రామం నుంచి ఆలయానికి స్థానిక ఆటోలు లభ్యమవుతాయి.

రైలు మార్గం:
సమీప ప్రధాన రైల్వే స్టేషన్ – కర్నూలు / గద్వాల వైపు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వనపర్తి చేరుకుని, శ్రీరంగాపురానికి వెళ్లవచ్చు.

రోడ్డు మార్గం:
హైదరాబాద్ నుంచి సుమారు 160–170 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి ద్వారా వనపర్తి చేరుకుని, అక్కడి నుంచి శ్రీరంగాపురానికి సులభంగా ప్రయాణించవచ్చు.

No comments