Achanta Ramalingeswara Swamy Temple: ఆచంట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలు 2026


శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శైవక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైనదిగా, మహిమాన్వితమైనదిగా భక్తుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా ఇక్కడ జరిగే మహా శివరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించబడుతూ ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి.

2026 సంవత్సర మహా శివరాత్రి ఉత్సవాలు ఫిబ్రవరి 13వ తేదీ నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి.

మహా శివరాత్రి ఉత్సవాల కార్యక్రమాల వివరాలు – 2026

ఫిబ్రవరి 13

అంకురార్పణ, బిల్వార్చన, ద్వజారోహణం, గ్రామోత్సవం, కళ్యాణోత్సవం

ఫిబ్రవరి 14

లక్ష బిల్వార్చన, ప్రత్యేక పూజలు, నంది వాహన సేవ, రావణబ్రహ్మ వాహన సేవ, సింహ వాహన సేవ, సర్ప వాహన సేవ, గజ వాహన సేవ

ఫిబ్రవరి 15

అభిషేకం, రథోత్సవం, విశ్వేశ్వర స్వామి కళ్యాణం, లింగోద్భవ అభిషేకం

ఫిబ్రవరి 16

అభిషేకం, పూజలు, సింహ వాహన సేవ

ఫిబ్రవరి 17

త్రిశూలోత్సవం, పుష్పోత్సవం

ఎలా చేరుకోవాలి – శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, ఆచంట

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

  • ఆచంట గ్రామం నరసాపురం – పాలకొల్లు రహదారి మార్గంలో ఉంది.
  • నరసాపురం నుండి సుమారు 12 కి.మీ దూరం
  • పాలకొల్లు నుండి సుమారు 15 కి.మీ
  • భీమవరం నుండి సుమారు 35 కి.మీ
  • రాజమండ్రి నుండి సుమారు 95 కి.మీ

APSRTC బస్సులు నరసాపురం, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల నుండి తరచుగా అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్ వాహనాలు, ఆటోలు కూడా సులభంగా లభిస్తాయి.

రైలు మార్గం

  • సమీప రైల్వే స్టేషన్: నరసాపురం
  • నరసాపురం రైల్వే స్టేషన్ నుండి ఆచంటకు రోడ్డు మార్గంలో బస్సులు/ఆటోలు లభిస్తాయి.

వైమానిక మార్గం

  • సమీప విమానాశ్రయం: రాజమండ్రి విమానాశ్రయం (సుమారు 100 కి.మీ)
  • అక్కడి నుండి టాక్సీ లేదా బస్సు ద్వారా ఆచంట చేరుకోవచ్చు.

No comments