Tirupati Kodandarama Temple: తిరుపతి కోదండరామస్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపు – కూపుచంద్రపేట ఉత్సవం 2026
తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే గ్రామోత్సవం ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.
ఊరేగింపు వివరాలు
ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 6.00 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి, తిరుపతికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూపుచంద్రపేట గ్రామానికి ఉదయం 9.30 గంటలకు చేరుకుంటారు.
గ్రామానికి చేరుకున్న అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
ఊంజల్ సేవ, గ్రామోత్సవం
అనంతరం సాయంత్రం 4.00 గంటల నుంచి 5.00 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. సాయంత్రం 5.00 గంటలకు గ్రామోత్సవం ఘనంగా నిర్వహించి, అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువస్తారు.
భజనలు, కోలాటాలతో భక్తిసందడి
ఉదయం మరియు సాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపుల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు గ్రామంలో భక్తి వాతావరణాన్ని నెలకొల్పి, ఉత్సవాలకు ప్రత్యేక శోభను చేకూర్చనున్నాయి.

Comments
Post a Comment